పుస్తక పరిచయం-39

వాల్ట్ విట్మన్ రాసిన Song of Myself (1855) ను నేను 'ఆత్మోత్సవ గీతం' (2022) పేరిట అనువదించాను. కిందటి వారం నుండి ఆ పుస్తకం పైన ప్రసంగాలు మొదలుపెట్టాను. కిందటి వారం ఆ పుస్తకం వెనక ఉన్న నేపథ్యం, ముఖ్యంగా ఎమర్సన్ దర్శనం గురించి వివరించాను. ఈ రోజు ఆ పుస్తకంలోని కొన్ని సర్గల్ని పరిచయం చేసాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.

ఆత్మోత్సవ గీతం

వాల్ట్ విట్మన్ రాసిన Song of Myself ను ఆత్మోత్సవ గీతం పేరిట తెలుగు చేసి ఈ-బుక్కు రూపంలో గతంలో మీతో పంచుకున్నాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు అనల్ప పబ్లికేషన్స్ బలరాం గారు పుస్తకగా తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఈ రోజు ఇలా విడుదల చేస్తున్నాము.

ఒక్క పాఠకుడు చాలడా!

ఆ  ఎదురు చూపులు అలా నడుస్తుండగా, అమెరికాలో ఉంటున్న మిత్రులొకరు, నేనొక అమెరికన్ మహాకవి మీద రాసిన పుస్తకం చదివాననీ, ఆ పుస్తకం వల్ల తనకు మరికొన్ని పుస్తకాలు పరిచయమయ్యాయనీ చెప్తూ నా కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకం తేగానే, నాకు అమెరికామీదా, ఇండియా మీదా కూడా మళ్ళా గొప్ప ఆశ చిగురించింది.