నరసింహారావుగారు ఆ ప్రశ్న విని చిరునవ్వారు. 'తెలుగు భాషకి ఆ ప్రమాదం ఎప్పటికీ ఉండదు’ అని అన్నారు. అక్కడితో ఆగకుండా, 'తెలుగు గురించి తెలుసుకోకపోతే తక్కిన ప్రపంచానికి ఎంత నష్టం!' అని కూడా అన్నారు.
కాని తెలుగు?
సాహిత్య భాషగా తెలుగు ప్రపంచంలోని అత్యుత్తమమైన పదిభాషల్లో ఒకటి. ఆ విషయంలో దిగులు లేదు. నేను మాట్లాడుతున్నది శాస్త్ర, సాంకేతిక భాషగా, సామాజిక శాస్త్రాల భాషగా తెలుగు వికసించవలసిన అవసరం గురించి.
