‘పూలపాన్పులు ఎన్నో ఉండగా, శంభూ, నువ్వీ శిలాతలాల్లోనే ఎందుకు నాట్యం చేస్తావు?’ అన్నాడు కవి. ఈ సొరంగాల్నీ, బయటకు తవ్వి తీసిన ఈ పందొమ్మిదిలక్షల టన్నుల మట్టినీ చూస్తుంటే పరమశివుని శిలాతలనాట్యంలోని సౌందర్యం, ప్రయోజనం ఎంత చక్కగా బోధపడుతున్నాయి!
నేను తిరిగిన దారులు-7
ఆ క్షణాన మాకు ‘అకృతాత్ములకు శిలానికరమై తోచు, సుకృతాత్ములకు లింగనికరమై తోచు’ అని శ్రీపర్వత సముదాయం గురించి కవి చెప్పిన మాట గుర్తొచ్చింది.
నేను తిరిగిన దారులు-6
'ఇదే, ఈ స్వామి విశిష్టత. నువ్వు సరాసరి దుమ్ము కొట్టుకున్న నీ పాదాల్లోనే, నీ మార్గాయాసంతోనే నేరుగా ఆయన్ని పలకరించవచ్చు. దీన్నే ధూళిదర్శనమంటారు. తన దర్శనం కోసం ఎన్నో మైళ్లు అడవుల్లో, కొండల్లో పడివచ్చిందే నిజమైన శ్రద్ధ. ఇక ప్రత్యేకనియమ బంధాలెందుకులే అనుకునే స్వామి ఈయన.
