నేను అప్పటిదాకా విద్యకీ, పాఠశాలలకీ గతిశీలత ఉందని భావించేవాణ్ణి. ఆ పుస్తకం చదివాక నా వాస్తవ అనుభవాలు నాకు బాగా బోధపడ్డాయి. విద్యకి గతిశీలత ఉండవచ్చేమో గాని పాఠశాలలు ప్రపంచమంతా కూడా యధాతథవాదానికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాయని బోధపడింది. ..
జీవన శిల్పి-23
ప్రజా ఉపాధ్యాయుల్లాంటివారు వీరంతా. పూర్వకాలంలో ఎవరూ లైబ్రరీకి వెళ్ళేవారు కారు. లైబ్రరీయే ప్రజల వద్దకు వచ్చేది. కూర్చున్నచోటకే వచ్చి వీరు ఇవన్నీ వినిపించేవారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైబ్రరీ. గ్రంథాలయాల్లాంటివారు. ఆ రకంగా వారి ద్వారా ప్రజలకి గొప్ప జ్ఞానం లభించేది
