నేను అప్పటిదాకా విద్యకీ, పాఠశాలలకీ గతిశీలత ఉందని భావించేవాణ్ణి. ఆ పుస్తకం చదివాక నా వాస్తవ అనుభవాలు నాకు బాగా బోధపడ్డాయి. విద్యకి గతిశీలత ఉండవచ్చేమో గాని పాఠశాలలు ప్రపంచమంతా కూడా యధాతథవాదానికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాయని బోధపడింది. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు-8
ఆ రాత్రి నేను నా స్వీయభూమికి చేరినట్టుగా భావించాను. ‘ఇదే నా కర్మ భూమి, నా సారస్వతం, నా రంగస్ధలం’ అని పదే పదే నాకు చెప్పుకున్నాను. ..
జీవన శిల్పి-26
అంతకంటే ముందు మనదగ్గర ఇన్ని టాక్స్ లు లేవు. ప్రజల మీద టాక్స్ లు లేవు. రాజులు ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న నియమమూ లేదు. రాజుల వైపునుండి చట్టాలు రావడం, వాటిని గ్రామాల్లో కొట్టికోట్టి అమలు చెయ్యడం ఇవేమీ లేవు. గ్రామవ్యవస్థల్లో రాజు అస్సలు జోక్యం చేసుకునేవాడు కాడు. 'మీ గ్రామం మీది, మీ నీరు, మీ అడవి, మీ భూమి మీవి. మిమ్మల్ని మీరు ఎలా క్రమబద్ధం చేసుకుంటారో అలా చేసుకోండి' అనేవాడు.
