స్వతంత్రమానవుడి కథ

కాని ఒక మనిషి నిజంగా సాధించవలసిన విజయం తన ఆత్మలో సాధించవలసిన విజయం అనేది అంత సులువుగా అర్థమయ్యే విషయం కాదు. ఒకవేళ అర్థమయినా అత్యధిక సంఖ్యాకులు అంగీకరించగలిగే విషయం కాదు. నిజమైన నాయకుడు తన ఆత్మిక విముక్తికోసం మాత్రమే కాదు, తనని అనుసరించే వాళ్ళ ఆత్మిక విముక్తికోసం కూడా తపిస్తాడన్నమాట ఆ అనుచరులకి అర్థమయ్యే విషయం కానే కాదు.

తన చేతికర్రనే జతకత్తె

ఇక ప్రసంగం విన్న తరువాత కూడా నన్ను వదలని గీతాలు రెండు: ఒకటి, డొగీ మెక్ లీన్ ఆలపించిన స్కాటిష్ గీతం, మరొకటి సుబ్బులక్ష్మి దర్బారీ రాగంలో ఆలపించిన 'హరీ తుమ్ హరో జన్ కీ పీర్..'

ఇరవయ్యవ శతాబ్దపు భక్తి కవి

ఆ పుస్తకంలో హోలాండ్ చేసిందల్లా రవీంద్రుడి గీతాంజలి ఇంగ్లీషు అనువాదంలోలాగా భగవంతుడి నామవాచకాల్ని సర్వనామాలుగా మార్చడం, చలం వచనాన్ని వజీర్ రహ్మాన్ కవిత్వంగా అమర్చినట్టు, కవిత్వపంక్తులుగా అమర్చి పెట్టడం. కాని, ఆ ఇంగ్లీషూ, ఆ క్లుప్తతా, ఆ సాంద్రతా, ఆ సూటిదనం, ఆ నైర్మల్యం పూర్తిగా గాంధీజీవి.