ఒక సజీవ తార్కాణ

విద్య పరమార్థం ఏదో ఒకటి నేర్పడం కాదు, నేర్చుకోవడమెట్లానో నేర్పడం అనే మాట నిజమైతే, ఆ లక్ష్యానికి తాడికొండ ఒక సజీవ తార్కాణ.

హీరాలాల్ మాష్టారు

నిన్న తెల్లవారు జాము నిద్రలో ఎందుకో ఫోన్ తడిమిచూసుకుంటే మెసేజి, విద్యారణ్య కామ్లేకర్ నుంచి, ఏ అర్థరాత్రి ఇచ్చాడో: 'భద్రుడూ, నాన్నగారు ఇక లేరు. 'అని. అది చూసినప్పటినుంచీ, నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే ఉంది.

వాళ్ళ ఋణం ఎప్పటికి తీర్చగలుగుతాను?

ఇక్కడ ఆకాశం మరీ పొద్దున్నే తెరుచుకుంటుంది. రాత్రంతా చినుకుతూనే ఉన్నా, ఆకాశమంతా కరిగిపోయి ఉన్నా కూడా, తడిసిపోయిన తెరవెనకనుంచి వెలుతురు ఆవరిస్తూనే ఉంది.పొలాలమీద, తాటిచెట్లమీదా వంగిన ముసురుమబ్బు. 

జీవితంలో తెరుచుకుంటున్న కొత్త పుటల్లో పాతలిపిని, ఒకప్పుడు నేర్చుకున్న అక్షరాల్నీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాను