విద్యాయాత్ర పూర్తయింది

పూర్వ విద్యార్థులు మామూలుగా తాము చదువుకున్న పాఠశాలలకి భవనాలో, సదుపాయాలో, వస్తుసామగ్రినో ఏదో ఒకటి అందిస్తారు. కాని మొన్న ఆ పూర్వ విద్యార్థులు ఒక మామిడితోట కానుక చేసారు. ప్రతి ఒక్కరూ తమ గుర్తుగా ముప్పై అయిదు మామిడిమొక్కలు నాటారు. దానికి '50 వసంతాల తోట' అని పేరు పెట్టారు.

దాదాపుగా అదొక జీవితకాలం

బహుశా ఈ యాభై ఏళ్లుగా నాలో మారనిది, ఇంకా చెప్పాలంటే మరింత ప్రజ్వరిల్లుతున్నది ఏదైనా ఉందంటే అది నా జిజ్ఞాస మాత్రమే. ఈ జిజ్ఞాసని పెంచి పోషించి ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ దీపం ప్రజ్వరిల్లుతూ ఉండేటట్లుగా చూడటమే తాడికొండ నాకు ఇచ్చిన గొప్ప కానుకగా నేను భావిస్తున్నాను.

బన గర్ వాడి

ఇన్నాళ్ళకు మరొకసారి బనగర్ వాడి చదివాను. దాదాపు నలభై అయిదేళ్ళ తరువాత. ఆ పసిప్రాయంలో నన్నంతగా లోబరుచుకున్న ఆ ప్రాశస్త్యం ఆ నవలదా లేక అప్పటి నా నిష్కళంక హృదయానిదా లేక తాడికొండ పాఠశాలదా అని పరిశీలనగా చదివాను. అదంతా ఆ కథలోని నైర్మల్యమని నాకిప్పుడు బోధపడింది.