అందుకనే విద్యారంగంలో కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు ఎవరు చేపట్టినా వారు నాకు సామాజిక సంస్కర్తలుగా కనిపిస్తారు. అటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా వాటిని వెంటనే పోయి సందర్శించాలనిపిస్తుంది. తక్కిన సమాజమంతా వినేలా వాటి గురించి ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.
పుస్తక పరిచయం-52
పుస్తక పరిచయ ప్రసంగ పరంపరలో భాగంగా, ఈ నెల నాలుగు శుక్రవారాలూ, నల్లజాతి చరిత్ర మాసోత్సవాన్ని పురస్కరించుకుని, ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన ప్రసంగించాను. ఈ రోజు నల్లజాతి మాసోత్సవం నేపథ్యం గురించి వివరించి, తొలి ఆఫ్రికన్-అమెరికన్ కవయిత్రి ఫిల్లిస్ వీట్లి గురించి ప్రసంగించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
నాలుగో ఉత్తరం
మార్కస్ అరీలియస్ 'మెడిటేషన్స్ ' పైన నేను చేసిన ప్రసంగాల మీద శ్రీమతి మాధవి గారు వారి అమ్మాయికి రాసిన మూడు ఉత్తరాలు ఆమె అనుమతితో ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇది నాలుగో ఉత్తరం.
