ప్రజా హృదయాల్ని గెల్చుకోగల రచనలు చెయ్యడమంటే పాపులర్ రచయితల పద్ధతిలో రాయడమనే ఒక అపోహ ఉంది. కానీ, అత్యున్నత సాహిత్య ప్రమాణాల్ని పాటిస్తూ కావ్యాల్లాంటి నవలికలు రాసినప్పుడు అవి ఒక ఇమ్మెన్సీలాగా, ఒక ఫామిలీ హ్యాపీనెస్ లాగా, ఒక దేవదాసులాగా, ఒక మార్తా లాగా ఏకకాలంలో సాధారణ పాఠకుల్నీ, సహృదయుల్నీ కూడా మెప్పించగలవని చెప్పడం కోసమే నేను ఇమ్మెన్సీ నవలని తెలుగు చేసాను.
కావ్యాత్మక వాస్తవికత-3
ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని 19, 20 శతాబ్దాల్లో, రష్యాలో, అమెరికాలో, ఆధునిక జర్మనీలో కూడా కావ్యాల్లాంటి నవలికలు రాస్తూనే ఉన్నారు. అటువంటివి ఆరేడు నవలలు చదివాను. ఆ నవలల్లో ఆ రచయితలు మానవానుభవం తాలూకు లోతుల్నీ, అనుభూతితాలూకు ఎత్తుల్నీ చేరుకోగలిగినప్పటికీ, ఇమ్మెన్సీలో సాధ్యపడ్డ శిల్పసౌష్టవాన్ని సాధించుకోలేక పోయారనిపించింది.
కావ్యాత్మక వాస్తవికత-2
అంటే మనిషి తన ఇచ్ఛ ప్రకారం, సంకల్పం ప్రకారం బాహ్య వాస్తవాన్ని మార్చలేకపోవచ్చు. కాని అంతమాత్రాన అతడు ఓడిపోయినట్టు కాదు, నిస్సహాయుడైపోయినట్టు కాదు, తాను జీవించడానికి అర్థం లేకుండా పోయినట్టు కాదు. మారిన పరిస్థితుల ఎదట కూడా అతడు తన మానవీయ గౌరవాన్ని కోల్పోకుండా, నిబ్బరంగా నిలబడవచ్చు. రైన్హార్డ్, ఎలిసబెత్ ల ద్వారా, ముఖ్యంగా రైన్హార్డ్ ద్వారా స్టార్మ్ అటువంటి ఒక జీవితాదర్శాన్ని, అటువంటి ఒక సగౌరవ ప్రత్యామ్నాయాన్ని చూపించాడు.
