
కనుక చెప్పగలను, పైకి కనిపించకపోయినా
చెట్టువీ నావీ వేర్లు పరస్పరం అల్లుకున్నాయని.
అక్కడ కొమ్మకొమ్మనా కాంతి చేరుతుంటే ఇక్కడ
నేనొక్కచోట కూడా నిలకడగా నిలబడకున్నాను.
చిగురించే వేళల్లో చెట్టుముందు నిలబడ్డ ప్రతిసారీ
మాటల కోసం తడుముకుంటాను. ఆ కొత్త భాష
అర్థంకాడానికి పూర్వకవుల పద్యాలు తిరగేస్తాను.
ఏం చెప్పను! వాళ్ళకీ వాళ్ళ పూర్వకవులే దిక్కు.
ఆ చెట్టు వెనక నిలబడి ఎవరో నన్ను పిలుస్తున్నారు
ఇదొక చిత్రమైన దాగుడుమూతలాట. తప్పదు, నేను
కూడా గంతలు కట్టుకోవాలి: కనిపించని వారు
కనిపించడానికి; కనిపించేది కనుమరుగవడానికి.
17-3-2026


భలే
ధన్యవాదాలు మేడం!
చాలా బాగా చెప్పారు సార్.
ధన్యవాదాలు సార్
ఆధునిక కవుల రచనలు చూస్తే వారు తమ కలల్లోని అస్పష్ట పొంతనలేని దృశ్యాలకు అక్షర రూపం ఇస్తున్నారా లేక జాగ్రదవస్థలోనే ఒక స్వప్న ప్రపంచాన్ని దర్శిస్తూ నోట్స్ వ్రాసుకుంటున్నారా అనిపిస్తుంది.
ఈ రచన ఎత్తుగడ చూస్తే
అన్నమయ్య వ్రాసిన అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో అన్న కీర్తన పల్లవి తలపుకు వచ్చింది.
పూర్తిగా అర్థం కాకపోయినా బాగుంది.
ఉగాది శుభాకాంక్షలు
—————————
పట్టినది పసిడి యగు , చే
పట్టిన ప్రతి కార్యమెల్ల ఫలవంతమగున్
గట్టిగ ‘ ఉగాది ‘ మొదలుగ
తుట్ట తుదవరకును మీకు తోషం బొదవున్ .
—– లక్కాకుల వెంకటరాజారావు .
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలు.🥭