కానుగచెట్టు దినచర్య

చంద్రుడిపైన సూర్యకాంతి పడితే వెన్నెలగా
మారుతుందని విన్నాను. ఫాల్గుణమాసపు
కానుగచెట్లపైన సూర్యకాంతి పగలే
వెన్నెలగా మారడం కళ్ళారా చూస్తున్నాను.

నిండుగా వికసించిన ఒక పసుపుపూలచెట్టుని
చూసి ఒకప్పుడు నా ఆశ్చర్యం ఆగలేదు
అది ప్రతి ఒక్కదాన్నీ నిరోధించడం చూసాను,
సౌందర్యరహిత ప్రపంచాన్ని పక్కకు నెట్టేసిందది.

ఇక్కడ అడ్డగించడానికంటూ ఏదీ మిగల్లేదు.
ఈ కానుగచెట్టు ప్రతి ఒక్కదాన్నీ తనలోకి
లాక్కుంటున్నది, చివరికి నన్ను కూడా
నోరారా కబళిస్తూండటమే దాని దినచర్య.

11-3-2026

2 Replies to “కానుగచెట్టు దినచర్య”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading