
పాల్కురికి సోమన రాసిన బసవపురాణంలో ముగ్ధ భక్తుల గురించిన ప్రసంగాల్లో రెండవ రోజు ప్రసంగం బెజ్జమహాదేవి గురించి. వాత్సల్య భక్తికి ఉదాహరణగా కృష్ణ భక్తి సాహిత్యంలో ఒక పెరియాళ్వారు, ఒక సూరదాసు మనకు కనబడతారు. కానీ ఒక తల్లి హృదయంతో శివుని పసిబిడ్డగా భావించి లాలించి పెంచుకున్న ఒక ముగ్ధ మాతృమూర్తి కథ ఇది. భారతీయ భక్తి సాహిత్యం లోనే ఇటువంటి కథ మరొకటి లేదు.
Featured image: Shiva, Parvati, Kartiklyya and Ganesha Traveling , 18th century, PC: Wiki Commons
16-11-2023
Thank you sir 🙏
అద్భుతం..సర్..తల్లి తత్వాన్ని ఎంత చక్కగా చూపారు..ఈ బసవ పురాణం లో..పైగా మీ వివరణ వలన నాటి సమాజం లో ఒక ఏ అవకాశాలు లేని వర్గం అన్నిటికీ దేముడే దిక్కు అనుకునే అమాయక భక్తి, ఆ నేపధ్యం లో ప్రశ్నించే , తీవ్రం గా స్పందించే తీరులు తెలియజేస్తూ.. బెజ్జమహాదేవి వాత్సల్య భక్తి ని మాకు విసదీకరించిన తీరు చాలా బావుంది. ఈ లాటి అమూల్య ఆడియో అందించిన మీకు ధన్యవాదాలు..మీకు సదా ఈశ్వర కటాక్ష సిద్ధి రస్తు..
ధన్యవాదాలు సార్
చాలా బాగుంది సర్
ధన్యవాదాలు
ధన్యవాదాలు
సర్, రుద్ర పశుపతి కథలో ముగ్ధ భక్తి అన్న మాట ముద్దుగా వుందనిపించింది. ఈ ప్రసంగం లో మీ విశ్లేషణ touching the aspect of ‘Literature reflecting the society’ and how the stories of Basava puranam reflected the then social construct and hierarchy and in their effort to escape the hierarchy, how people turned to sincere, severe Bhakti margam, added depth to understanding this literature, sir. ఇప్పుడు ముగ్ధ భక్తి అన్న మాట బరువుగా వుందనిపిస్తోంది.
Literature can be appreciated at a superficial level (and I think there is nothing wrong with it) but మీరన్నట్లు అందులో సత్యానికి చేరువ కాలేము.
మీ ఈ ప్రసంగాల ద్వారా ఇలాంటి గొప్ప రచనలను పరిచయం చెయ్యడమే కాకుండా వాటిని ఎలా appreciate చెయ్యాలో కూడా నేర్పుతున్నందుకు పాద నమస్కారములు. 🙇🏻♀️
అమ్మవ్వ బెజ్జమహాదేవి కీ ఆమెని సృష్టించిన అసలైన అమ్మ పాల్కురికి కవికీ మనసులో 🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️.
వినడం అంటే ఇలా వినాలి. మీ సహృదయ స్పందనకు మీకు పరిపరి ధన్యవాదాలు!