పోస్టు చేసిన ఉత్తరాలు -10

వాళ్ళ జీవితాల్లో వాళ్లు చూసిన వెలుగు, వాళ్ళ జీవితాల్ని దహించివేసిన ఒక తపన, లోకాతీతమైన ఏ సౌందర్యమో తమని నిలనివ్వకుండా నడిపించిన ఒక అనంత నీలిమ- వాటిని మళ్లా మన జీవితాల్లోకి వడగట్టుకోవడం. ఎమర్సన్ ఒక ప్రసంగంలో చెప్పినట్టుగా మల్బరీ ఆకులు పట్టు వస్త్రంగా మారే ప్రక్రియ.