గొప్ప నాటకకర్తలందరూ చేసిన పని ఇదేననుకుంటాను. ఎందుకంటే, ఆ మనుషులు మనకి తెలియనీ, తెలియకపోనీ, మన వాళ్ళవనీ, కాకపోనీ, వాళ్ల మధ్య intense గా సంభవించేది ఏదైనా సరే మనలోనూ అంతే గాఢమైన సంవేదనని మేల్కొల్పుతుంది. ఎవరి కలకలమైనా మనదే అనిపిస్తుంది, ఎవరి కన్నీళ్ళయినా మనవే అనిపిస్తాయి.