కొత్తగోదావరి

కానీ ఈ కవికి కాలం గురించిన స్పృహ ఉంది. ఇప్పటి కాలం నలభయ్యేళ్ళ కిందటిలాగా లేదనీ, ఇది ‘గాజు ఆవహించిన కాలం’ అనీ అతడికి తెలుసు. ‘బొటనవేలు తప్ప శరీరమంతా నిరుపయోగమైపోయింద’ని కూడా తెలుసు. కానీ, ఆ సౌకుమార్యానికీ, ఆ ‘సరస్వతీ హ్రదపు జ్ఞాపకానికీ’ అతడు దూరం కాలేదు.