పోస్టు చేసిన ఉత్తరాలు-12

భగ్నమైపోయిన ఆ స్నేహాల్ని అలా భగ్నం కాకుండా ఎందుకు కాపాడుకోలేకపోయాం? లేదా ఈ ప్రశ్న మరోలా అడగాలంటే, ఇప్పటికీ, భగ్నం కాకుండా మిగిలి వున్న స్నేహాలు ఎలా మిగలగలిగాయి? బహుశా ఏ ఔషధం సేవించి ఉంటే, ఆ భగ్న స్నేహాలు భగ్నం కాకుండా ఆరోగ్యంగా మిగిలి ఉండేవి?