బసవ పురాణం-4

బసవపురాణంలోని ముగ్ధభక్తుల కథల్లో భాగంగా ఈ రోజు నాలుగో ప్రసంగం నాట్యనిమిత్తండికథ గురించి. ఈ కథలో భాగంగా పాల్కురికి సోమన చేసిన శివతాండవ వర్ణన, చోళకాలపు నటరాజకాంస్యశిల్పం లాంటిది. ఇంత మహోధృతమైన వర్ణన చదవడం, వినడం వాటికవే ఆ నాట్యాన్ని కళ్ళారా చూసినంత అనుభవాలు.