పోస్టు చేసిన ఉత్తరాలు-9

నీ ఇంద్రియాలూ, చైతన్యమూ, అనుభూతీ మేల్కొంటున్నాయని తెలిసాక, నువ్వు ప్రయాణం కొనసాగించవలసిందే, ఆపడానికి నీకు నైతికమైన హక్కులేదు. నీతో కలిసి నడవగలిగినవాళ్ళు నడవగలిగినంత దూరం నడుస్తారు. వాళ్ళు ఆగిపోవచ్చు, కానీ కాలాంతరంలో మరెవరో మరెక్కడో నిన్ను చూసి తమ ప్రయాణానికి ధైర్యం తెచ్చుకుంటారు.

పోస్టు చేసిన ఉత్తరాలు -8

ఎవరి జీవితమైనా ట్రూత్ గా పరివర్తన చెందినప్పుడు, ఆ ట్రూత్ ఆ జీవితం దగ్గరే ఆగిపోదు. అది రాసినవాళ్లనీ, చదివినవాళ్లనీ అందర్నీ ఆ సత్యప్రవాహంలోకి లాక్కుంటుంది. నన్ను లోలోపల నిలువెల్లా కదిలిస్తున్న ఆ సత్యాన్ని నీతోకాక మరెవరితో పంచుకుంటాను చెప్పు?

పోస్టు చేసిన ఉత్తరాలు-7

నిజమే, ఈ వార్తలు ప్రపంచానికి అక్కర్లేదు. కానీ ప్రపంచం పసిది, దానికేం తెలుస్తుంది? చూడు, ఆకాశమూ, సూర్యరశ్మీ తనకు అవసరంలేదన్నట్టే ఉంటుంది పొద్దున్న లేచి దాని నడవడి. కాని అవి లేకపోతే ప్రపంచం క్షణం కూడా మనజాలదని మనకు తెలుసు. అందుకనే నిజమైన కవి తనని తాను ముందు భగవంతుడి వార్తాహరుడిగా నియమించుకుంటాడు.