ఇన్నేళ్ళ నా అభిప్రాయాన్ని పరాస్తం చేసేసారు సుష్మ. కబీర్ దోహాలకి నా వచన అనువాదాల్ని ఆమె ట్యూన్ చేసి నాకు పంపించినప్పుడు నన్ను సంభ్రమం ముంచెత్తింది. ఎలా అయితే, అనువాదాన్ని దాటి కూడా కవిత్వం ప్రవహించగలదో, అనువాదాన్ని దాటి సంగీతం కూడా ప్రవహించగలదని ఇప్పుడు నాకు అర్థమయింది.