పోస్టు చేసిన ఉత్తరాలు -15

కానీ నీకు లభించిన ఆ ప్రేమకి నువ్వు యోగ్యుడు కావడానికి సాధన చెయ్యాలి. ఒకరోజో, ఒక ఏడాదో కాదు, ప్రతి రోజూ చెయ్యాలి. ఒక రోజు సాధనతో మరొక రోజు స్నేహం నిలబడుతుంది. ఆ మరొకరోజు స్నేహం ఆ తర్వాతి రోజు సాధనకి శక్తినిస్తుంది. స్నేహమంటే, ఎప్పటికప్పుడు నివురులూదుకోవలసిన నిప్పు.