మూడు దశలు

The Twin, Watercolor, A6

చదవగా, చదవగా నాకేమి అర్థమయిందంటే, చిత్రలేఖనంలో మూడు దశలున్నాయని. మొదటిదశలో నువ్వు కాపీయిస్టువి. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా దానికి ప్రతికృతి రాసుకుంటూ పోతూ ఉంటావు. ప్రకృతిని గానీ, పూర్వచిత్రలేఖనాల్ని గానీ, ఇప్పుడు ఫొటోగ్రాఫుల్ని గానీ. ఇది చాలా సుదీర్ఘమైన దశ. నెమ్మదిగా ఆ దశలోంచి నువ్వు అనువాదకుడిగా మారవలసి ఉంటుంది. చూసిందిచూసినట్టుగా కాక, నీ భాషలోకి అనువదించుకోవడం మొదలుపెట్టాలి. గీతల్ని కాక, ఆకృతుల్ని పట్టుకుని, వాటిని నీ గీతల్లోకి మార్చుకోడం మొదలుపెట్టాలి. ఆ తర్వాత దశ, అంటే బాగా పండిన దశలో, నువ్వు వ్యాఖ్యాతగా మారతావు. చూసినదాన్ని అక్కడున్నట్టుగా కాక, నువ్వెలా చూస్తున్నావో, ఆ చూసినదాన్ని నీ సొంతమాటల్లో పెట్టవలసి ఉంటుంది.

2006 లో మొదలుపెట్టిన ఈ సాధనలో ఇన్నాళ్ళకు నేను నెమ్మదిగా అనువాదకుడిదశలోకి అడుగుపెడుతున్నానని తెలుస్తోంది. ఇది ఎన్నేళ్ళు సాగుతుందో తెలియదు. కాని ఎప్పటికో ఒకప్పటికి నా దృగ్గోచర సత్యాన్ని నా సొంత రంగుల్లో, రేఖల్లో చిత్రించగలనన్న నమ్మకం మాత్రం బలంగానే ఉంది.

ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న ఈ అనువాదాల్లో ఇంకా సారళ్యం రావాలి, సాహసం రావాలి.

The Morning in a Pot, Watercolor, A6

Late Summer, Watercolor, A6

Autumn is Seeping through, Watercolor, A5

Past and Present, Watercolor, A6

The Solitary Planter, Watercolor, A5

Droplets of Silence, Watercolor, A4

28-7-2023

18 Replies to “మూడు దశలు”

  1. అన్నీ జీవం ఉట్టిపడుతున్న చిత్రాలు. ముఖ్యంగా The late summer, The twin, The solitary planter గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ప్రొద్దున్నే మీ చిత్రాలు అత్యంత ఆహ్లాదాన్ని కలిగించాయి.

  2. The Solitary Planter ,Autumn is Seeping through బాగున్నాయనిపిస్తోంది

  3. మూడు దశలు.. బాగా చెప్పారు. దశలు దాటుతున్న తీరును చిత్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ల్యాన్డ్ స్కెప్ లు గొప్పగా ఉన్నాయి

  4. అయ్యో అదేమిటి నేను బాగుంది అని టైపు చేస్తే
    బాగుండదు అని పడింది .అది తప్పు కామెంటు సర్ ఫోన్ టైపో .క్షమించండి. నేనే కదా నిన్న పాఠాలు చెప్పేవారు లేరన్నది.మీ నుండి పుస్తకం రావాలన్నది. ఇక్కడ పోస్ట్ చేసింది పొరపాటున చెక్ చెయ్యకుండానే సబ్మిట్ చేస్తే వెంటనే కనుపించదు కదా దానివల్ల జరిగిన అనర్థం

  5. చిత్రలేఖనంలో చేతిలో కుంచె కదలికల నైపుణ్యమే మనోహరంగా,ఆశ్చర్యానందాలని
    కలిగిస్తుందనిపిస్తుంది సర్.కాపీయింగ్ అన్న మాటని ఆ ప్రజ్ఞకి ఆపాదించటం అన్యాయమనిపిస్తోంది.
    చిత్రకళలోని మొట్టమొదటి సొబగు అనిపిస్తుంది.
    భావప్రధానమైన చిత్రంలో కనులకు విందుచేసే
    రమణీయత ఉండదనిపిస్తుంది.మరో గాఢమైన కవితలా అనిపిస్తుంది అంతే.
    MODERN ART!
    ఏమో…చిత్రకళలో భావంకన్నా కనులవిందుకే
    ప్రాధాన్యత బావుంటుందేమో అనిపిస్తుంది.
    ప్రకృతి మాట్లాడుతూనే వుంటుంది కదా ఎప్పుడూ…దానిని యథాతథంగా చూపిస్తే
    మాటలు ఆగిపోయినట్టుకాదుకదా సర్!
    బహుశః నేను మీ ఆలోచనల స్థాయిని అందుకోలేకపోతున్నానేమో.

      1. బహుశా మీ విశ్లేషణ సరియైనది కావచ్చేమో కానీ, ప్రతి చిత్రమూ సుందరం, అద్భుతం 💚

  6. droplets of silence.. అవాక్కయ్యాను . తేరుకుని కామెంట్ పెట్టడానికి ఎంత time పట్టిందో ఏమో. Beautiful . కార్తీక మాసం తెల్లారేలోపు స్నానం చేసి, నా తిట్లని పట్టించుకోకుండా తడి బట్టలతో పూజలు చేసే మా మామ్మ మెదిలింది.

  7. Good observation of your artistic progress. I think these stages correspond to realism, impressionism and expressionism styles in art.
    Your paintings are soothing to the eyes and mind. Please keep up the beautiful work, sir.

Leave a Reply

%d bloggers like this: