రాజమండ్రి డైరీ-9

దినచర్య ఆత్మనుంచి వస్తుంది. ఆత్మ దైనందిన జీవితంలోంచి రూపొందుతుంది. ఇక్కడ ఏది దేన్ని destroy చేస్తూంది? మంచి హృదయమున్న మనుషులు మన దినచర్యలో భాగమయితే, అప్పుడు ఆత్మ ఈ బండబారిపోవడం నుంచి కాస్త కాస్త ప్రాణం పోసుకుంటూ వుంటుంది. కాని, ఏరీ అలాంటివాళ్ళు?

రాజమండ్రి డైరీ-8

శ్రమించాలనీ, మన శ్రమలో నలుగురూ కలవాలనీ, శ్రమఫలితాన్ని అంతా కలిసి అనుభవించాలనీ అనుకుంటాం. కని శ్రమనుంచి ఎంతో పరాయితనం, ఇష్టంగా చేసే, యీ సాహిత్యకృషి అయినా శ్రమ అనుకొందాం అనుకుంటాము, కాని, ఇక్కడ మనుషులు ముందే విడిపోతారు.

రాజమండ్రి డైరీ-7

'మీరు నా రచనలో చూస్తున్న confusion, incoherence వీటివెనుక మంద్రంగానయినా విన్పిస్తున్న సూనృతగీతాన్ని మీరు విని వుండాల్సింది. ఆమె తేజోరూపిణి అయిన రాజరాజేశ్వరి అయినా, terracota అమ్మతల్లి ప్రతిమలయినా అన్నిటివెనుకా ఒకే అమ్మవారి ప్రసన్న దయావిలోకనమే కదా