AN AFTERNOON IN AGRA

1995 నుంచి 2001 మధ్యకాలం ఆరేళ్ళలో నేను రాసినవి నాలుగే కవితలు. ఒకటి బిమల్ రాయ్ సుజాత సినిమా చూసినప్పుడు రాసిన కవిత, అది నా దగ్గరలేదు. మరొకటి, డిల్లీలో ఒక రష్యన్ బాలే చూసినప్పుడు ‘క్షమించు రష్యా ‘అని రాసిన కవిత. అది కూడా లేదు. 1996 లో అదిలాబాదు వెళ్ళినప్పుడు, ‘అదిలాబాద్, 96’ అని ఒక కవిత రాసాను. దాన్ని ‘పునర్యానం’లో చేర్చాను. మరొకటి, 1997 లో ఆగ్రావెళ్ళినప్పుడు రాసిన ఈ కవిత. దీన్ని ‘కోకిల ప్రవేశించే కాలం’లో చేర్చాను.
 
ఈ కవితని పెద్దలు నౌదూరి మూర్తిగారు ఇంగ్లిషులోకి అనువదించి తన బ్లాగులో ప్రచురించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మరోసారి నేను ఈ కవితను ఇంగ్లిషు చేస్తున్నాను.
 
 

ఆగ్రాలో ఒక మధ్యాహ్నం

 
ఆకాశమంతటా ఆవరించిన
మలిహేమంతపు ఎండలో
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
పండులో పుల్లదనంలాగా చలి.
 
పురాతన స్వప్నం తాజమహల్ ఎవరో
నిన్నరాత్రే భూమ్మీద ప్రతిష్టించినట్టుంది.
 
మెరిసిపోతున్నవి పాలరాతి గుమ్మటాలు
ధవళ అపరాహ్ణ శోభలో.
సాగిలబడుతున్నారు దాని ఎదట
కొత్త ఆరాధ్కులు మరికొందరు.
 
నా ఎదట పచ్చికలో ఒక పుష్పం
దాని పరాగకేంద్రంలో ఒక భ్రమరం.
 
పుష్పం కోసం భ్రమరం
భ్రమరం కోసం పుష్పం.
వాటిమిలన పునర్మిలనాలతో
నా కళ్ళు పండగ చేసుకున్నాయి.
 
మూగుతూనే ఉన్నారు మనుషులు
కెమేరాల్తో ఆ రమ్యమహల్ చుట్టూ.
 
ఈ మధ్యాహ్నం నా ఎదట
దినాంతానికి రాలిపోయే
అజేయపుష్పం, షాజహాన్ కన్న
ప్రేమోన్మత్త భ్రమరం.
 
1997
 

AN AFTERNOON IN AGRA

 
In the late autumn sun,
An afternoon in Agra.
There is a chill in the air
As a sourness in the fruit.
 
This ancient dream, the Tajmahal,
Still looks as fresh as yesterday.
 
On the marble domes,
The afternoon light shines white.
Prostrating before the monument
A new generation of admirers.
 
A flower on the lawn in front of me.
Among its pollen is a bee.
 
The flower for the bee, and
The bee for the flower.
As I am watching them meet,
It was a delight to sight.
 
Still swarming around the building
Streams of people with cameras in hand.
 
This afternoon, in front of me,
A flower that fades by evening,
Yet invincible, and a bee
Even more passionate than Shajahan.
 
28-8-2022
 
 
 
 
 
 
 
 

2 Replies to “AN AFTERNOON IN AGRA”

Leave a Reply

%d