ఎందుకంటే, స్టోయిక్కులు చెప్పినట్లుగా ప్రపంచాన్ని మార్చడం మనచేతుల్లో లేని పని. కాని ప్రపంచం పట్ల మన స్పందనలూ, ప్రతి స్పందనలూ మాత్రం మన చేతుల్లో ఉన్నవే. వాటిని మనం అదుపుచేసుకోగలిగితే, మనం ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సమీపించాలో ఆ విధంగా సమీపించగలిగితే, తప్పకుండా మనమున్న మేరకు ప్రపంచం మారడం మొదలుపెడుతుంది. విమర్శ, ఖండన, ద్వేషం, దూషణ చెయ్యలేని పని మన జీవితమే ఒక ఉదాహరణగా మనం చెయ్యగలుగుతాం.
యు ఆర్ యునీక్
అన్నిటికన్నా నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం, డా.కలాం తన జీవితంలో చివరి సంవత్సరాలకు వచ్చేటప్పటికి సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తడం. ఆయన కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడేడు, పంపిణీ గురించి పట్టించుకోలేదు అనేవారికి ఈ పుస్తకం ఒక సమాధానం.