రాబర్ట్ బ్లై అమెరికన్ కవి, అనువాదకుడు. గత శతాబ్దంలో యాభైల్లో మన కవులు అమెరికావైపు చూస్తూ ఉన్నప్పుడు, అతడు తూర్పుదేశాలవైపు చూస్తూ ఉన్నాడు. ప్రపంచపు నలుమూలలనుంచీ గొప్ప కవుల్నీ, కవిత్వాన్నీ ఇంగ్లీషులోకి అనువదించి అమెరికాకీ, ప్రపంచానికీ పరిచయం చేసాడు. అట్లా తాను అనువదించిన 24 మంది కవుల కవితల్ని కొన్నింటిని The Winged Energy of Delight (హార్పర్ కాలిన్స్, 2005) పేరిట ఒక సంకలనంగా వెలువరించాడు.