కోనేటిరాయుడు

కామించి కోరితే కరుణ కురిపించిన కరుణాసముద్రుడు కాబట్టే ఆయన్ని అన్నమయ్య కోనేటి రాయుడని పిలిచి ఉంటాడు. అదీకాక కొండలరాయడు అనడం స్వభావోక్తి. కొండలలో నెలకొన్న కోనేటిరాయడం అనడంలోనే కదా కవిత్వముంది!

ఎట్లాంటి ప్రేమ వర్షిస్తోందంటే

ఈ మధ్య కాలంలో రోగర్ హౌస్డన్ కవిత్వాన్ని ఒక వ్యక్తిత్వ వికాస సాధనంగా ప్రచారం చేస్తున్నాడు. ఆయన రాసిన టెన్ పొయెంస్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఈ మధ్య పలమనేరు బాలాజీ కవిత్వం 'ఇద్దరి మధ్య 'కు ముందుమాట రాస్తూ నేను ప్రస్తావించించింది ఈ హడ్సన్ గురించే.