నేను తిరిగిన దారులు-11

నేను దార్లపల్లిలో అందెల కన్నపురెడ్డిని అడిగాను: 'నీకు నలుగురితో పాడుకోవడం సంతోషంగా ఉంటుందా, ఒక్కడివే పాడుకోవడం సంతోషంగా ఉంటుందా? అని. అతనన్నాడు కదా, 'నలుగురితో కలిసి పాడుకోవడం పండగ. కానీ, నలుగురితో కలవలేనంత మాత్రాన పాడుకోవడం మానను. మనసుకి సంతోషమైనప్పుడల్లా పాడుకుంటూనే ఉంటాను.'

నేను తిరిగిన దారులు-10

ఆ కొండల్ని అర్థం చేసుకోవడానికి రకరకాల పోలికల కోసం ప్రయత్నించాను. ఆ జలరాశి ఒక సరస్సనీ, ఆ కొండలు పెద్దసరస్సులో నీళ్ళు తాగడానికి వచ్చిన ఏనుగు మందలనీ అనుకోవడం కూడా బాగుంది. అవి నదీవాద్యం పైన నిరంతరంగా వినిపిస్తున్న సంగీత తరంగాలని అనుకోవడం కూడా సంతోషాన్నిచ్చింది.

నేను తిరిగిన దారులు-8

‘పూలపాన్పులు  ఎన్నో ఉండగా, శంభూ, నువ్వీ శిలాతలాల్లోనే ఎందుకు నాట్యం చేస్తావు?’ అన్నాడు కవి. ఈ సొరంగాల్నీ, బయటకు తవ్వి తీసిన ఈ పందొమ్మిదిలక్షల టన్నుల మట్టినీ చూస్తుంటే పరమశివుని శిలాతలనాట్యంలోని సౌందర్యం, ప్రయోజనం ఎంత చక్కగా బోధపడుతున్నాయి!