నేను తిరిగిన దారులు

ఈ పుస్తకం చదవడం పూర్తికాగానే, ఒక అపూర్వ చారిత్రక గ్రంథాన్ని చదువుతున్నట్లు, ఆయాకాలాల సామాజిక, సాంస్కృతిక చరిత్రను అవగాహన చేసుకుంటున్నట్లు, సాహిత్య సంగీత శిల్ప చిత్రలేఖనాది కళలను ఆస్వాదిస్తున్నట్లు, స్వచ్ఛమైన నదీజలాల్లో తేలియాడుతున్నట్లు, దిగంతపరివ్యాప్త సందేశ సాన్నిధ్యాన్ని కలిగించే పర్వతాలనధిరోహించినట్లు, ఎన్నో యుగాల రహస్యాలను అందించాలని తహతహలాడుతున్న ఆరణ్యక ప్రాకృతిక సౌందర్యాల వెన్నెలలో తడిసినట్లు అనుభూతిని చెందడం మాత్రం సత్యం.

నేను తిరిగిన దారులు

ఇండియా టుడే తెలుగు పత్రిక కోరికమీద వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాలైన అరకులోయ, శ్రీశైలం,భద్రాచలం ప్రాంతాల యాత్రావర్ణనలు రాసారు. ఆ తర్వాత ఇంగ్లాండు సందర్శించినప్పుడు మరొక సమగ్రమైన యాత్రాకథనం వెలువరించారు. ఆ కథనాలకు, మరికొన్ని అనుభవకథనాలు జోడించి 2010 లో వెలువరించిన యాత్రాగ్రంథం 'నేను తిరిగిన దారులు.'