పాడేరు కొండలమీద ప్రయాణించినప్పుడల్లా ప్రాచీన చైనా కవిత్వంలో ప్రయాణించినట్టుంటుంది. ప్రాచీన చీనా చిత్రలేఖనం ఒకటి మనముందు విప్పి పరుస్తున్నట్టు ఉంటుంది. ఆ అడవిదారుల్లో కొండలమీంచి సాగిపొయే మేఘాల నీటి ఆవిరి, కెరటాల్లాగా కొండలు, ఎర్రటి తురాయిచెట్లు, దూరంగా లోయల్లో అక్కడా అక్కడా కొండపల్లెలు, ఆ ఇళ్ళ కప్పులమీంచి పైకి లేచే వంటపొగ160