కాని వారం పది రోజుల కిందట ఒక రాత్రి ఆ పుస్తకం తీసి చూద్దును కదా, అందులో, గురుప్రసాద రావుగారికి చలం గారు రాసినవీ, సంజీవ దేవ్ గారు రాసినవీ కొన్ని ఉత్తరాలు కూడా ఉన్నాయి. ఆ ఉత్తరాలు చదివేటప్పటికి నేను మాటల్లో పెట్టలేని ఒక అనిర్వచనీయమైన సంతోషం నన్ను ఆవహించింది. నా సొంత నేలకి నేను మరింత దగ్గరగా జరిగాననిపించింది.
ఆషాఢమేఘం-21
ప్రాచీన కాలంలో కవిత్వమంటే వర్ణన. ప్రధానంగా శబ్దాలతో చేసే వర్ణన. చిత్రలేఖకుల భాషలో చెప్పాలంటే వర్ణలేపనం. సంగీతకారుల భాషలో చెప్పాలంటే స్వరప్రస్తారం. కవి వర్ణన నెపంతో కొత్త భాషని తన శ్రోతలకి అందిస్తాడు. అది వాళ్ళకి కొత్త రెక్కలిచ్చినట్టు ఉంటుంది.
ఆషాఢ మేఘం-2
మేఘాన్ని చూడగానే భారతీయ కవికి ఏకకాలంలో ప్రేమా, దుఃఖమూ రెండూ కలుగుతాయి. వసంతాన్ని చూసినప్పుడు కలిగే భావనలు ప్రణయోద్దీపభావనలే తప్ప వాటిలో విషాదఛాయలుండవు. కానీ ఆషాఢమేఘం ఏకకాలంలో కవికి ఈ ప్రపంచం పట్ల అలవిమాలిన ప్రేమా, దీన్నుంచి తొలగిపోతున్నాననో, తొలగిపోవాలనో ఏదో ఒక గాఢనిర్వేదమూ, ఒక్కసారే ఆవహిస్తాయి.
