అందుకే మన దగ్గర ఊరు సమృద్ధికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యక్తిగత సంపదకి కాదు. ఊరు బాగుంటే అందులో ఉండే సామాన్య వ్యక్తి కూడా బాగుంటాడు. మన లక్ష్యం ఊరిని అభివృద్ధి చెయ్యడం కావాలి.
చివరి రొమాంటిక్
హైని ప్రేమించినంతగా మార్క్స్ కూడా జర్మన్ ని ప్రేమించాడు. అతడి నవయవ్వనంలో తొలిసారిగా ప్రేమలో పడ్డప్పుడు ఆ ప్రేమని వ్యక్తం చెయ్యడానికి అందరిలాగా రోజువారీ జర్మన్ ని కాకుండా గొథే, హైని లాంటి కవులు తీర్చిదిద్దిన జర్మన్ కోసం వెతుక్కున్నాడు.
