గురూజీ గురించి తలుచుకోవలసింది, ఆయన చెప్పిన మాటల్ని మళ్ళా మళ్ళా మననం చేసుకోవలసిందీ చాలా ఉంది. కొన్ని కొన్ని మాటలమీద కొన్నేళ్ళ పాటు చర్చించుకోవలసి ఉంటుంది. దలైలామా సహచరుడైన రింగ్ పోచే కళాశ్రమాన్ని చూసి 'మీరు గాంధీజీ హింద్ స్వరాజ్ పుస్తకంలో ఏమి రాసారో అచ్చం అలానే జీవిస్తున్నారు ' అని అన్నాడట.
జీవనశిల్పి
ఆ మధ్య రాం దేవ్ బాబా ఆయన్ని 'ఆధునిక ఋషి' అన్నాడట. గురూజీని సదా అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకునే ఆశీష్ ఆ మాట విని ఆయన్ని 'ఆధునిక ఋషి' అనికాదు 'సమకాలిక ఋషి' అని అనాలి అన్నాడట.
