మీర్ తకీ మీర్ వాక్యంలాగా, అటువంటి ఒక్క వాక్యం, ఒక్క పదప్రయోగం చాలు, మనలో ఒక అరణ్యాన్ని నిద్రలేపడానికి. ఒక చంద్రవంకని నావగా చేసి మనల్నొక వెన్నెలప్రవాహంలోకి తీసుకుపోవడానికి. ఒకింత పన్నీరు మనమీద చిలకరించి, ఒక పెళ్ళి సంరంభాన్ని మనముంగిట నిలబెట్టడానికి.
అసలైన ప్రేమ ఏదో
నిర్మాణం ప్రకారం చూస్తే,ఆ గజల్లో మక్తా లేదు, తఖల్లుస్ లేదు. కాని ఆ గీతం పొడుగునా ఆ ప్రేమికుడి గుండె నెత్తుటితో చేసిన సంతకం కనిపిస్తూనే ఉంది.