దాదాపు రెండుగంటల పాటు అదంతా చూసేక చాలా విలువైన ఒక సృజనని చూసాననిపించింది. అంతకన్నా కూడా అత్యంత విలువైన ఒక వ్యక్తిత్వం, సంస్కారం పరిచయమయ్యాయి అనిపించింది. చెన్నబసవయ్య రుమాలె (1910-88) దేశభక్తుడు, శాసనసభ్యుడు, పాత్రికేయుడు, పురావస్తుప్రేమికుడు, యోగి, ఆధ్యాత్మిక సాధకుడు అని కూడా తెలిసింది. ..
