కరదీపిక

భారతరరాజ్యాంగ రూపకర్తలు గిరిజన ప్రాంతాల్లో 'శాంతి', 'సుపరిపాలన' ఉండాలని కోరుకున్నారు. వాళ్ళ వెనక నూటయాభై ఏళ్ళుగా రక్తంలో తడిసిన గిరిజన ప్రాంతాల జ్ఞాపకాలున్నాయి. 'శాంతి', 'సుపరిపాలన' అనే మాటలు వాడటంలో రాజ్యాంగ రూపకర్తలు ఎంతో వివేకాన్నీ, దూరదృష్టినీ కనపరిచారు.

ఇన్నొవేషన్ అసాధ్యం కాదు

గ్లోబలైజేషన్ యుగం మొదలయ్యాక అభివృద్ధికి రెండు వనరులు ప్రధానమని ప్రపంచమంతా గుర్తిస్తున్నారు. ఒకటి information, రెండోది, innovation. ఇన్నొవేషన్ అంటే కొత్త పుంతలు తొక్కడం. కానీ ఇన్నొవేషన్ ప్రైవేటు రంగంలోనూ, వాణిజ్యరంగంలోనూ తలెత్తినంతగా ప్రభుత్వరంగంలో ఇంకా ప్రస్ఫుటం కావడంలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు సహజంగానే గతానుగతికంగానూ, కరడుగట్టిన ఆచారాలతోనూ కూడుకుని పనిచేయడం, ఇన్నొవేషన్ నువెన్నంటే రిస్క్ కూడా ఉన్నందువల్ల, ఆ రిస్క్ ని తలదాల్చడానికి ఎవరూ సిద్ధపడకపోవడం కొంత కారణం.