ఆమెని రష్యాలో నీతో పోలుస్తారట. Russian Sappho. ఒక్క కవిత్వంలోనే కాదు, జీవితంలో కూడా ఆమెకీ నీకూ చాలా పోలికలున్నాయి. నువ్వూ ప్రవాసివే, ఆమె కూడా ప్రవాసినే. కాని ఆమె తన స్వదేశంలోనే ప్రవాసి. ఆ మాటకొస్తే ప్రవాసి కాని కవి ఎవరు?
గూటెన్ బర్గుకన్నా ముందటికాలానికి..
ఈ పద్మవ్యూహంలో నాకై నేను అనుసరిస్తున్న austerity measure ఒకటున్నది. అదేమంటే, కవిత్వం పుస్తకాల రూపంలో ప్రచురించకపోవడం. దానికి బదులు కవిత్వపుస్తకాల్ని డిజిటలు పుస్తకాలుగా ఇంటర్నెట్టు ద్వారా అందుబాటులో ఉంచడం.
