ముంగిట్లో నీళ్ళగోలెం లాగా

రెండు ప్రపంచాలనుకున్నాను, కాదు మూడు
ప్రపంచాలు. బయట ప్రపంచానికి మరీ బయట
మరో ప్రపంచముంది. యుద్ధాలు జరిగేదక్కడే.
మారణాయుధాల, మందుపాతరల ప్రపంచం.

దానికి లోపల మరొక ప్రపంచముందే, అక్కణ్ణుంచే
హననాలు మొదలయ్యేది. ఊసుపోక కబుర్లు, అరిగీ
అరగని అనుభవాలు, నిలదొక్కుకోని నమ్మకాలు,
పైపైనే జీవించేవాళ్ళ వేళ్ళమరకలు, ఊపిరి మసకలు.

దాన్ని దాటాకనే నీ అసలైన ప్రపంచం. కాళ్ళూ
చేతులూ కడుక్కుని మరీ ఇంట్లో అడుగుపెట్టినట్టు
స్వస్థ పరిమళాల్తో నువ్వు తేటపడాలి. అందుకనే,
ముంగిట్లో నీళ్ళగోలెంలాగా, విరబూసిన వేపచెట్లు.

25-3-2026

6 Replies to “ముంగిట్లో నీళ్ళగోలెం లాగా”

  1. పైపైనే జీవించేవాళ్ళ వేళ్ళమరకలు, ఊపిరి మసకలు

    baagundi sir.

  2. Yes sir, బయట ప్రపంచానికి మరీ బయట
    మరో ప్రపంచముంది. యుద్ధాలు జరిగేదక్కడే…అక్కడికి ఎవరూ వెళ్లరు,కానీ లాగబడతారు..

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading