ఒక కానుగ చెట్టు వంగిన కొమ్మ కింద కూర్చుని, ఎలిసబెత్ అన్ని వైపులా శ్రద్ధగా చెవి పెట్టి ఆలించడం మొదలుపెట్టింది. అక్కడికి కొద్దిగా దూరంలో రైన్హార్డ్ ఒక మొద్దుమీద కూర్చుని, ఆమె వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.
తేనెటీగల కొలను-1
పదేళ్ళ కిందట ఆ నవల చదివినప్పుడు దానిమీద రాసుకున్న ఒక పోస్టు (తేనెటీగల కొలను) మీరిక్కడ చూడవచ్చు. ఇన్నాళ్ళకి ఆ నవలికని తెలుగులోకి అనువదించగలిగాను. ఈ రోజునుంచీ దాన్నిక్కడ మీతో పంచుకోబోతున్నాను.
ఉష్ణీశ పరిత్యాగ శిల్పం
మనం మరుక్షణం ఉండము, నిజమే, కానీ, ఈ క్షణం ఈ శిల్పం ఎదట నిలబడ్డప్పుడు, బుద్ధుడి ఆత్మవిజయ క్షణం మనం అనుభూతి చెందుతాం. అది చూసినప్పుడు మనకి సంతోషం కలుగుతున్నదంటే, మనలో కూడా బుద్ధత్వం మేలుకుంటున్నట్టే కదా. ఈ ఒక్క క్షణం చాలు మనం పుట్టినందుకు.
