ఆశ్చర్యకరమైన విషాదమేమిటంటే, అప్పటికీ, ఆ తరువాత ముఫ్పైఏళ్లకీ కూడా మోదుగ పరిస్ధితిలో ఏ మార్పూ లేదు. ఒకవేళ నేను కూడా నా మోదుగయాత్ర గురించి రాయవలసి వస్తే నా రచన కూడా దాదాపుగా అలానే ఉంటుందనిపించింది. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు-8
ఆ రాత్రి నేను నా స్వీయభూమికి చేరినట్టుగా భావించాను. ‘ఇదే నా కర్మ భూమి, నా సారస్వతం, నా రంగస్ధలం’ అని పదే పదే నాకు చెప్పుకున్నాను. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు -7
ఆ రాత్రంతా ఆకాశం పెళపెళ ఉరుముతూనే ఉంది. మధ్యమధ్యలో మెరుపుల తళతళలు పాకలోకి కూడా ప్రసరిస్తున్నాయి. ఎక్కడో కొండచరియలు విరిగిపడ్డట్టు వర్షం దబదబబాదుతూ ఉంది. నాకు నిద్ర పట్టలేదు. నా జీవితంలో ప్రారంభమయిన ఈ కొత్త అధ్యాయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను.
