ఎంతమంది తెలుగువాళ్ళు, ఎంతమంది భారతీయులు అమెరికా వెళ్ళలేదు, ఎంత మంది అక్కడ నివసించడం లేదు! కాని ఈ స్ఫురణ, ఆదికవి వాల్మీకికీ, అమెరికన్ మహాకవి వాల్ట్ విట్మన్ కీ ఉన్న ఈ పోలిక ఇప్పటిదాకా ఎవరికీ తోచకపోవడం ఎంత ఆశ్చర్యం! నేను కూడా చదివాను, Out of the Cradle Endlessly Rocking- కానీ నాక్కూడా తట్టలేదు. ఇది విజయసారథి వంటి రసాన్వేషికి మాత్రమే తట్టే స్ఫురణ. ఒక్కమాటలో చెప్పాలంటే, a once in a lifetime insight!
వసంతమొక అగ్ని
రాలిన పూలు రాలుతున్న పూలు, ఇంకా చెట్లని అంటిపెట్టుకున్న పూలు- మూడు రకాల పూలూ కూడా గాలితో ఆటలాడుకుంటున్న దృశ్యాన్ని వర్ణిస్తోనే కవి ఏకకాలంలో పారవశ్యాన్నీ, శోకాన్నీ కూడా పలవరించిన అరుదైన వర్ణన రామాయణంలో వసంత ఋతువర్ణన
కర్ణికార పుష్పాలు: మూడు దృశ్యాలు
అంతటా నిండుగా విరబూసిన ఈ కర్ణికారవృక్షాల్ని చూస్తుంటే పచ్చటి ఉడుపులు కట్టుకుని పసిడినగలు తొడుక్కున్నట్టుంది
