కాలేజిలో మాకు సౌందర్య దృష్టి గురించి చెప్పినప్పుడు సౌందర్యదృష్టి అంటే ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. చాలా సార్లు అర్థం చేసుకోడానికి ప్రయత్నించినా అర్థం కాలేదు. దేన్ని సౌందర్యదృష్టి అంటారో తెలియలేదు. కానీ ఇక్కడికొచ్చినప్పుడు ఒక గోండు ద్వారా బోధపడింది. ఓహో! దీనే సౌందర్య దృష్టి అని అంటారూ అని.
