సూర్యసూక్తం

నేను వేసుకున్న అనేక ప్రణాళికల్లో ఒకటి, నన్ను తీవ్రంగా ముగ్ధుణ్ణి చేసిన కొందరు ఆధునిక ప్రపంచ కవుల మీద విపులంగా పరిచయ వ్యాసాలు రాయాలనేది. అట్లా అనుకున్న వెంటనే అధునిక స్పానిష్ మహాకవి ఆంటోనియో మచాడో మీద ఒక వ్యాసం రాసాను.