పుస్తక పరిచయం-56

నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఈ ఫిబ్రవరిలో ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ నాలుగు ప్రసంగాలు చేసాను. ఆ సాహిత్యకారుల గురించి స్థూలంగా ముచ్చటించుకోడానికేనా మరో నాలుగు ప్రసంగాలు అవసరమవుతాయి. కాని మనం మార్చి నెలలో ప్రవేశించాం కాబట్టి ఈనాటి ప్రసంగంతో నల్లజాతి చరిత్ర మాసోత్సవం పూర్తిచేస్తున్నాను. ఈ రోజు పాల్ రోబ్సన్, మాయా ఏంజిలో, రాల్ఫ్ ఎల్లిసన్, టోనీ మారిసన్ ల గురించి స్థూలంగా పరిచయం చేసాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

పుస్తక పరిచయం-33

కాళిదాసు మేఘసందేశ కావ్యంలో రెండవ సర్గ మీద చేస్తున్న ప్రసంగాలకు కొనసాగింపుగా ఈ రోజు 2:8-18 శ్లోకాల గురించి ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినొచ్చు.

పుస్తక పరిచయం-31

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశంలోని రెండవ సర్గ గురించి ఈ రోజు ప్రసంగించాను. ఈనాటి ప్రసంగంలో ప్రధానంగా ఉత్తరమేఘం విశిష్టత, అది ఏ విధంగా కావ్యాన్ని పూర్వమేఘంతో కొనసాగిస్తున్నదీ, కవి ఉద్దేశిస్తున్న కావ్య వ్యంగ్యం ఏమై ఉండవచ్చు మొదలైన ఆలోచనలు పంచుకున్నాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.