నిజమే, నైపుణ్యానికవతల ప్రత్యేక జ్ఞానమంటూ ఏదీ ఉందని మనం నిశ్చయంగా చెప్పలేకపోవచ్చు. ప్రతి నైపుణ్యమూ కూడా అంతిమంగా ఏదో రకమైన జ్ఞానమే కావచ్చు. అంతమాత్రాన విద్యానుభవం కేవలం నైపుణ్యకల్పన మాత్రమేనని మనం అంగీకరించవలసిన అవసరం లేదు.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-5
ఆ విధంగా చూసినట్లయితే, విద్యఅనేది నైపుణ్యం ఎంతవరకూ అంటే తనేదో తను తెలుసుకోవడానికీ, తనేది కాడో దాన్ని విసర్జించడానికి మాత్రమే. విద్యా సముపార్జనా చక్రంలో రెండు అర్ధవలయాలున్నాయనుకుంటే మొదటి అర్ధవలయం ‘లెర్నింగ్ ’ అయితే, రెండవ అర్ధవలయాన్ని ‘అన్ లెర్నింగ్’ గా మనం భావించవలసి ఉంటుంది. ..
ఇంతకీ విద్య మంచిదేనా?
మనిషి పుట్టుకతోటే విద్యావంతుడు. కాని ఆ విద్య అతడి మనసులో మరుగునపడిపోయి ఉంటుంది. గురువు చెయ్యవలసిన పని ఆ స్మృతిని మేల్కొల్పడం. గురువూ, శిష్యుడూ నిరంతరం వివేకరక్తులుగా సంభాషిస్తూ, సంభాషిస్తూ ఉండగా, ఒకనాటికి, ఒక హఠాత్ క్షణాన, ఆ స్మృతి నిప్పురవ్వలాగా విద్యార్థిలో మేల్కొంటుంది.
