అనువాదమంటే కొత్తరక్తం ఎక్కించడం

ఒక భాషలో కవిత్వం మరో భాషలోకి అనువాదమయ్యేటప్పుడు అన్నిటికన్నా ముందు నష్టపోయేది సంగీతమనేది అందరూ అంగీకరించిన విషయమే. ఆ మాట నేనింతకు ముందు రాసాను కూడా. భాషల పరిమితుల్ని దాటి ప్రవహించేవి మెటఫర్, మూడ్,భావజాలం మాత్రమే అని కూడా రాసాను.