సత్యం, శివం, సుందరం- వీటికి మూడు చిహ్నాలున్నాయి. సత్యానికి, కళలో చిహ్నం, చతురస్రం. ఎక్కడ వేసినా చతురస్రం చతురస్రమే. శివానికి త్రిభుజాకారం చిహ్నం. ఎక్కడ వేసినా ఒక కోణం పైకి ఉంటుంది. సౌందర్యానికి చిహ్నం వృత్తం. ప్రతి ఒక్క దేవాలయంలోనూ ఈ మూడింటినీ ఉంచుతారు. ..
బసవ పురాణం-4
బసవపురాణంలోని ముగ్ధభక్తుల కథల్లో భాగంగా ఈ రోజు నాలుగో ప్రసంగం నాట్యనిమిత్తండికథ గురించి. ఈ కథలో భాగంగా పాల్కురికి సోమన చేసిన శివతాండవ వర్ణన, చోళకాలపు నటరాజకాంస్యశిల్పం లాంటిది. ఇంత మహోధృతమైన వర్ణన చదవడం, వినడం వాటికవే ఆ నాట్యాన్ని కళ్ళారా చూసినంత అనుభవాలు.
