నేను తిరిగిన దారులు-13

‘ఇదిగో, ఇదే చలంగారి సమాధి, ఈ మధ్యే మున్సిపాలిటీవాళ్లు రోడ్డు వెడల్పు చేయడంకోసం దీన్ని కొట్టేశారు’ అన్నాడు. అదొక పాడుబడ్డ సిమెంటు కట్టడం. దానిమీద ఆరిపోయిన ప్రమిద ఒకటి ఉంది. ఆ సిమెంటుగోడలు నాచుపట్టి ఉన్నాయి. నాకు విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. ఇక్కడ ఈ సమాధి లేకపోతే బావుండేదనిపించింది.