ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018

ప్రపంచబాంకు ప్రతి ఏటా వెలువరించే ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018 వ సంవత్సరానికి వెలువడింది. 1978 నుంచీ వెలువరిస్తున్న ఈ నివేదికల పరంపరలో బాంకు విద్య గురించి మొదటిసారిగా వెలువరించిన నివేదిక ఇది.  మారుతున్న ప్రపంచ సామాజిక-ఆర్థిక గతిని ఎప్పటికప్పుడు ఎంతో నిశితంగానూ, లోతుగానూ పట్టుకోవడమే కాక, ప్రపంచదేశాలకూ, రాజకీయ విధాననిర్ణయవేత్తలకూ మార్గదర్శకంగా ఉండే ప్రపంచబాంకు తన వార్షిక అభివృద్ధి నివేదికల్లో ఇంతదాకా విద్య గురించి మాట్లాడవలసినంతగా మాట్లాడకపోవడమే ఒక ఆశ్చర్యం.