ఇతివృత్తం అంటే సారాంశమూ, రసానుభూతీ రెండూను. రసానుభూతిలేని సారాంశం కేవలం శాస్త్రసత్యంగా మాత్రమే మిగిలిపోతుంది. రసానుభూతిని మేల్కొల్పే ఇతివృత్తం మాత్రమే కథగా మారుతుంది. కథాశిల్పం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఇతివృత్తాన్ని రసానుభూతిగా మార్చగలిగే కౌశల్యం.